Household Mapping Splitting Option

Telugu Schemes
Household Mapping Splitting Option Release
Household Split - Marriage

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కు సంబంధించి సమస్యలు ఎదుర్కుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ను డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్ లో ఎనేబుల్ చేయడం జరిగింది.


హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ కొరకు దరఖాస్తు చేయడానికి దరఖాస్తు దారుడు తమకు దగ్గరలోని గ్రామం/వార్డు సచివాలయాన్ని సందర్శించాలి.


అయితే Household Split - Marriage అనేది వివాహం ఆధారంగా మాత్రమే హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ కు అనుమతిస్తుంది.


ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న వారిని స్ప్లిట్ చేయాలంటే కొన్ని సందర్భాలలో మాత్రమే వీలు పడుతుంది. అయితే ఆ కొన్ని సందర్భాలు ఏమిటి అనే సమాచారం ఈ క్రింద వివరించడం జరిగింధి.


తండ్రి, తల్లి, కొడుకు మరియు కోడలు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే వీరు Household Mapping Split సర్విస్ కొరకు తమకు దగ్గరలోని సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు.


తండ్రి, తల్లి మరియు కొడుకు ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండి కోడలు వాళ్ళ యొక్క పుట్టింటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే వీరు ముందుగా కొడల్ని కొడుకు ఉంటున్న హౌస్ హోల్డ్ లో మ్యాపింగ్ లో యాడ్ చేయాల్సి ఉంటుంది.


ఇందుకు గాను మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అదే విధంగా డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్ లో మ్యారేజ్ మైగ్రేషన్ సర్విస్ రిక్వెస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది.

తర్వాత వీరు వారి యొక్క గ్రామ వార్డ్ సచివాలయం లో Household Mapping Split సర్విస్ కొరకు అప్లై చేసుకోవచ్చు.


తండ్రి/తల్లి ఒకరు మరణించి ఒకరు మాత్రమే ఉండి వారు కొడుకు మరియు కోడలుతో కలిసి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే వీరికి Household Mapping Split సర్విస్ కొరకు అప్లై చేసుకొనుటకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. కానీ, ప్రభుత్వం త్వరలో వీరికి కూడా Household Mapping Split సర్విస్ కొరకు అప్లై చేసుకొనుటకు అవకాశం ఇస్తామన్నారు.


విడాకులు తీసుకున్న భార్య మరియు భర్త ఇద్దరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే కోర్థు ద్వారా పొందిన డివోర్స్ డిక్రీ ఉంటే వీరు Household Mapping Split సర్విస్ కొరకు తమకు దగ్గరలోని సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు.

User Manual for Household Split Option

Download User Manual
Please Wait...
Direct Link click here.
Important Information
Fee No Fee
SLA 21 days
Documents Checklist Proof of Marriage (any one document mandatory)
  1. Marriage Certificate
  2. Rice Card
  3. Aarogyasri Card
  4. Family Member Certificate
  5. Passport
  6. Aadhaar Card
Proof of Separate living: Field verification
Household Split - Single Old Age Person

Single Old Age Person Split చేయాలంటే వారి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనీసం ఒక జంట అయిన ఉండాలి.


Single Old Age Person Split చేయాలంటే వారి వయసు 60 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండాలి అలాగే Widow/Widower అయ్యి ఉండాలి.


Documents Required for Single Old Age Person Split
Proof of Marriage (any one document mandatory)
  1. Rice Card
  2. Spouse Death Certificate
  3. Widow Pension Card
To Top