మీరు గ్రామ వార్డ్ సచివాలయంలో ఏదైనా స్కీమ్ కు లేదా కుల దృవీకరణ పత్రం, ఆధాయపు దృవీకరణ పత్రం ఇలా ఏదైనా సర్విస్ కొరకు దరఖాస్తు చేసుకున్నారా! అయితే మీ యొక్క దరఖాస్తు యొక్క అప్లికేషన్ నెంబర్ అలాగే దరఖాస్తు స్థితి అనేది మీకు తెలియదా! అటువంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపి సేవ పోర్టల్ లో ఒక మంచి సర్విస్ ను అయితే తీసుకువచ్చింది.
అయితే ఈ సర్విస్ వలన గ్రామ వార్డ్ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ యొక్క స్టేటస్ ను తెలుసుకోవచ్చును అలాగే దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ నెంబర్ ను ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా కేవలం దరఖాస్తు దారుడి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చును.
✅ ముందుగా ఏపి సేవ పోర్టల్ యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
✅ ఆ తర్వాత హోం పేజిలోని మెనూ బార్ లో Enter Your Aadhar దగ్గర దరఖాస్తు దారుని యొక్క ఆధార్ నెంబర్ ను నమోదు చేసి సెర్చ్ సింబల్ పై క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ ద్వారా ఏమేమి సర్విస్ లకు దరఖాస్తు చేసుకున్నారో ఆ వివరాలు అన్నీ మీకు స్క్రీన్ పై కనిపిస్తాయి.
✅ ఒకవేళ మీరు అప్లికేషన్ నెంబర్ పై క్లిక్ చేస్తే మీరు క్లిక్ చేసిన సర్విస్ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది.