మీరు మీ పొలానికి ఈ-క్రాప్ బుకింగ్ చేయించారా? అయితే చాలా మంది రైతులు తమ పొలానికి ఈ-క్రాప్ బుకింగ్ చేయించిన తర్వాత VAA మరియు VRO ఇద్దరు కూడా రైతులు ఈ-క్రాప్ చేపించిన పంటకు బయోమెట్రిక్ అనేది వేసారో! లేదో అని సందేహ పడుతుంటారు.
మీరు చేయించిన ఈ-క్రాప్ బుకింగ్ కి VAA మరియు VRO ఇద్దరు తమ యొక్క బయోమెట్రిక్ ద్వార ఈ-కేవైసి అనేది పూర్తి చేసారా? లేదా! అనే విషయాన్ని ఇలా తెలుసుకోండి.
✅ ముందుగా మీరు e-Karshak యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
✅ హోం పేజిలోని మెనూ బార్ లో ఉన్న Search బటన్ పై క్లిక్ చేస్తే మీకు రెండు ఆప్షన్ లు కనిపిస్తాయి. అవి
- Search By Khata And Survey Number
- Search By District And Aadhar
✅ ఆ తర్వాత మీరు Search By District And Aadhar పై క్లిక్ చేయాలి.
✅ మీ జిల్లాని ఎంచుకొని అలాగే మీరు ఈ-క్రాప్ చేయించే సమయంలో ఏ ఆధార్ నెంబర్ ఇచ్చారో ఆ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేస్తే మీ యొక్క ఈ-క్రాప్ బుకింగ్ ఈ-కేవైసి స్టేటస్, VAA మరియు VRO Authentication స్టేటస్ ఇలా అన్ని వివరాలు మీకు స్క్రీన్ పై కనిపిస్తాయి.