2 నిమిషాల్లో Caste & Income సర్టిఫికేట్ ని ఇలా పొందండి

Telugu Schemes

పాత Caste సర్టిఫికేట్ మరియు Income సర్టిఫికేట్ నెంబర్ ద్వార కొత్త Caste సర్టిఫికేట్ మరియు Income సర్టిఫికేట్ ను రెండు నిమిషాల్లో పొందగలమా? అవునండి తప్పకుండా పొందవచ్చును.


ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రామ వార్డ్ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో Re-Issuance of Certificate అనే సర్వీస్ ద్వార పాత Caste సర్టిఫికేట్ లేదా Income సర్టిఫికేట్ నెంబర్ ద్వార కొత్త Caste సర్టిఫికేట్ లేదా Income సర్టిఫికేట్ ను రెండు నిమిషాల్లోనే పొందవచ్చు.

పాత Caste లేదా Income సర్టిఫికేట్ ద్వార కొత్త సర్టిఫికేట్ ఎలా పొందాలి?

మీరు మీ యొక్క పాత Caste లేదా Income సర్టిఫికేట్ ను తీసుకొని మీకు దగ్గరలోని గ్రామ వార్డ్ సచివాలయంను సంప్రదించడం ద్వార అక్కడున్న డిజిటల్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్ ద్వార AP సేవ పోర్టల్ లో మీ పాత Caste లేదా Income సర్టిఫికేట్ లో ఉన్న వివరాలను నమోదు చేసి అలాగే రెన్యువల్ చేసి కొత్త Caste లేదా Income సర్టిఫికేట్ ను ఇస్తారు.


How to apply Re-Issuance of Caste & Income Certificate?

✅ ముందుగా AP సేవ పోర్టల్ లో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వార లాగిన్ అవ్వాలి.


✅ హోం పేజిలో Revenue Services లో ఉన్న Re-Issuance of Certificate అనే సర్వీస్ పై క్లిక్ చేస్తే Re-Issuance of Income/Integrated Application Form అనేది ఓపెన్ అవుతుంది.


✅ ఆ తర్వాత అప్లికేషను ఫారం లో అడిగిన వివరాలను ఎంటర్ చేసి Continue పై క్లిక్ చేసిన తర్వాత Relation With Applicant ను ఎంచుకోండి.


✅ Service Type మీకు కావలసిన Income Certificate లేదా Integrated Certificate ను ఎంచుకోవాలి.


✅ మీరు ఎంచుకున్న సర్టిఫికేట్ యొక్క అప్లికేషను నెంబర్ ను ఎంటర్ చేసి, మీరు Re-Issuance of Certificate కొరకు ఎందుకు అప్లై చేసుకుంటున్నారో ఆ కారణాన్ని ఎంచుకొని Get Details పై క్లిక్ చేస్తే దరఖాస్తుదారుడి మొబైల్ ఫోన్ కి ఓటిపి వస్తుంది.


✅ ఆ వచ్చిన ఓటిపి ని ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయగానే సర్టిఫికేట్ అనేది Generate అవుతుంది.

To Top