Crop Cultivator Rights Cards | CCRC Certificate

Telugu Schemes
CCRC సర్టిఫికేట్ అంటే ఏమిటి?

సొంత భూమి లేని వ్యక్తి సొంత భూమి కలిగి ఉన్న రైతు దగ్గర నుండి భూమిని కౌలుకు తీసుకొని సాగుచేసే వారిని కౌలు రైతు అని అంటారు. అయితే ఇలా భూమిని కౌలుకు తీసుకొని సాగుచేసే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ పంట సాగుదారు పత్రాలను అందజేస్తుంది. దీనినే CCRC సర్టిఫికేట్ అని అంటారు.


ప్రయోజనాలు

ఈ CCRC సర్టిఫికేట్ ద్వార ఉచిత పంటల భీమా, సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ, పంట రుణాలు ఇలాంటి పథకాలకు కౌలు రైతు అర్హత పొందవచ్చును. అలాగే కౌలు రైతుకు వైయస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఏటా రూ. 7,500 పెట్టుబడి సాయం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.

CCRC సర్టిఫికేట్ కొరకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ముందుగా కౌలు రైతు భూమి యజమాని దగ్గర నుండి భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నట్లు ఒక అగ్రిమెంట్ రాయుంచుకొని, ఆ డాక్యుమెంట్ తో పాటు భూమి యజమాని యొక్క పట్టదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు మరియు కౌలుకు తీసుకుంటున్న రైతు యొక్క ఆధార్ కార్డు మరియు పాస్ ఫోటోని తీసుకొని మీ గ్రామ VRO దగ్గరికి వెళ్ళాలి.


అప్పుడు VRO గారు మీరు సమర్పించిన పత్రాలను పరిశీలించి CCRC Portal మీ వివరాలను నమోదు చేసి మీకు CCRC సర్టిఫికేట్ ను అందజేస్తారు.


VRO లాగిన్ లో CCRC సర్టిఫికేట్ కొరకు ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి?

✅ ముందుగా CCRC అధికారిక వెబ్ సైట్ ccrc.ap.gov.in ను సంప్రదించండి.


✅ VRO యొక్క Username, Password మరియు Captcha ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.


✅ Enter Aadhar or Khata Number of the Land Owner దగ్గర భూమి యజమాని యొక్క ఆధార్ నెంబర్ లేదా ఖాతా నెంబర్ ను ఎంటర్ చేసి Search పైన క్లిక్ చేస్తే, భూమి యజమానికి ఉన్న పొలం ఖాతా నెంబర్ కి లింక్ అయిన సర్వే నెంబర్ మరియు పొలం వివరాలు అనేవి స్క్రీన్ పైన కనిపిస్తాయి.


✅ ఆ తర్వాత భూమి యజమాని కౌలుకు ఇస్తున్న సర్వే నెంబర్ ఎంచుకొని ఆ సర్వే నెంబర్ ఉన్న దగ్గర టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది.


✅ Land Owner Address దగ్గర భూమి యజమాని యొక్క అడ్రస్ మరియు Land Owner Mobile No. దగ్గర భూమి యజమాని యొక్క మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.


✅ No. of Months for Land Enrollment దగ్గర భూమి యజమాని తన పొలాన్ని ఎన్ని నెలలు కౌలుకు ఇస్తుండో అన్ని నెలల సంఖ్యను ఎంచుకోవాలి.


✅ Tenant Aadhar Number దగ్గర కౌలుకు తీసుకుంటున్న రైతు యొక్క ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, అలాగే Verify పై క్లిక్ చేయాలి.


✅ Tenant Mobile Number దగ్గర కౌలుకు తీసుకుంటున్న రైతు యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, అలాగే Tenant Gender దగ్గర కౌలుకు తీసుకుంటున్న రైతు యొక్క Gender ను ఎంచుకొని మరియు Tenant Caste దగ్గర కౌలుకు తీసుకుంటున్న రైతు యొక్క Caste ను ఎంచుకోవాలి.


✅ Tenant Photo దగ్గర కౌలుకు తీసుకుంటున్న రైతు ఫోటోను అప్లోడ్ చేసి Verify పై క్లిక్ చేస్తే VRO యొక్క లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది.


✅ అప్పుడు VRO యొక్క లాగిన్ పాస్వర్డ్ ను ఎంటర్ చేసి, Submit పై క్లిక్ చేయగానే VRO Verification Successfull అని స్క్రీన్ పైన కనిపిస్తుంది.


✅ ఆ తర్వాత GENERATE CCRC CARD పై క్లిక్ చేస్తే CCRC కార్డు అనేది Generate అవుతుంది.

CCRC Login Page

To Top