Link Aadhaar Card and Voter Card in Online

Telugu Schemes
Aadhaar & Voter Card Link

ఓటర్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. అయితే మీకు దగ్గరలోని గ్రామ వార్డ్ సచివాలయాన్ని సంప్రదించడం ద్వార కూడా మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చును. ఎస్ఎంఎస్ ద్వార, ఫోన్ ద్వార, అలాగే NVSP పోర్టల్ లో ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు.

Aadhaar-Voter Linking Process through NVSP Portal

ముందుగా మీరు NVSP పోర్టల్ లో లాగిన్ అవ్వాలి.


ఆ తర్వాత హోం పేజిలో ఎడమ వైపు ఉన్న Information of Aadhaar Number by Existing Electors పై క్లిక్ చేయాలి.


Form Type లో Form 6B ని ఎంచుకోవాలి. Form 6B ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఆ ఫారం లో అడిగిన వివరాలను పూరించి


మీరు ఎంటర్ చేసిన వివరాలను Preview లో చూసుకొని Submit బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఒక Reference నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ ద్వార మీరు లింకింగ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు.


Aadhaar-Voter Linking Process through Voter Helpline App

ముందుగా Voter Helpline యాప్ ఓపెన్ చేసి, VOTER REGISTRATION పై క్లిక్ చేయాలి.


ఆ తర్వాత Electoral Authentication Form (Form 6B) పై క్లిక్ చేయాలి.


Let's Start పై క్లిక్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి SEND OTP పై క్లిక్ చేస్తే ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. ఆ OTP ని ఎంటర్ చేసి VERIFY చేయాలి.


I have Voter ID number లో Yes ను ఎంచుకొని Next పై చేయాలి.


మీ ఓటర్ ఐడీ నెంబర్ ను ఎంటర్ చేసి, మీ యొక్క రాష్ట్రాన్ని ఎంచుకొని Fetch details పై క్లిక్ చేసి Proceed పై క్లిక్ చేస్తే మీ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.


మీ వివరాలు ఒకసారి చెక్ చేసుకొని Next పై క్లిక్ చేసి, మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈ- మెయిల్ ఐడీ మరియు మీ గ్రామం పేరు ఎంటర్ చేసి Done క్లిక్ చేస్తే Confirmation అడుగుతుంది.


అప్పుడు మీరు Confirm పై చేస్తే, స్క్రీన్ పై మీకు ఒక Reference నెంబర్ అనేది స్క్రీన్ పై కనిపిస్తుంది.


NVSP Official Website

Download Voter Helpline Mobile App

To Top