Know Your PM Kisan Registration Number

Telugu Schemes

రైతు ఒకసారి పి యం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో చేరాక ఆ రైతు ఒక రిజిస్ట్రేషన్ ప్రభుత్వం కేటాయించడం జరుగుతుంది. అయితే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ను రైతు మర్చిపోయినప్పుడు లేదా తెలియనప్పుడు మల్లి అదే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా పొందాలి అనే సమాచారం ఈ కింద తెలుపబడింది.


అంతే కాకుండా రైతు PM Kisan Beneficiary Status తెలుసుకోవాలన్న తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా పి యం కిసాన్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయిన ఉండాలి. అప్పుడే మాత్రమే రైతు PM Kisan Beneficiary Status అనేది తెలుసుకోగలడు.


పి యం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవాలంటే ముఖ్యంగా రెండు మార్గాలు అనేవి ఉన్నాయి. మొదటిది పి యం కిసాన్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వార మరియు రైతు ఆధార్ నెంబర్ ద్వార ఈ రెండు మార్గాల ద్వార పి యం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను తెలుసుకోవచ్చు.

How to Know PM Kisan Registration Number through Aadhaar Number?

✅ ముందుగా మీరు పి యం కిసాన్ పథకం యొక్క అధికారిక యాప్ ను ఓపెన్ చేయాలి.


✅ ఆ తర్వాత Beneficiary Status పై క్లిక్ చేసి Select ID Type దగ్గర మీ ఆధార్ నెంబర్ ను ఎంచుకొని, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get Active Installments పై క్లిక్ చేస్తే అక్కడ Select Installment Number అని వస్తుంది.


✅ అప్పుడు మీరు ఏదో ఒక Installment Number ఎంచుకొని Get Details క్లిక్ చేస్తే రైతు వివరాలు అనేవి మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. అందులో మీకు కావలసిన రిజిస్ట్రేషన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.

How to Know PM Kisan Registration Number through Mobile Number?

✅ ముందుగా మీరు పి యం కిసాన్ పథకం యొక్క అధికారిక వెబ్ సైట్ pmkisan.gov.in ను ఓపెన్ చేయాలి.


✅ పి యం కిసాన్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి, క్యాప్త్చ కోడ్ ని ఎంటర్ చేసి Get Data క్లిక్ చేస్తే పి యం కిసాన్ లబ్ది దారుని వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.


✅ ఆ లబ్ది దారుని వివరాలలో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది. ఇలా మీరు సులభంగా పి యం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ని తెలుసుకోవచ్చు.

To Top