Household Mapping Status in AP

Telugu Schemes
Household Mapping Status

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ని నియమించడం జరిగింది. అయితే ప్రతి గ్రామ వాలంటీర్ తనకు కేటాయించిన ఇళ్ళను తనకు కేటాయించిన క్లస్టర్ కింద మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. అయితే మీ కుటుంబంలోని సభ్యుల వివరాలు ఏ వాలంటీర్ కింద మరియు ఏ క్లస్టర్ కింద మ్యాపింగ్ అయ్యిందో.. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంత మంది ఉన్నారు అనే విషయాలు అన్ని ఈ కింద తెలిపిన విధముగా మీరే సులభంగా తెలుసుకోవచ్చు.


హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్తితి తెలుసుకోవాలంటే మీ ఆధార్ కార్డుకి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.

How to know your Household Mapping Status?

మొదటగా మీరు గ్రామ వార్డ్ సచివాలయం యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

𝐇𝐨𝐮𝐬𝐞𝐡𝐨𝐥𝐝 𝐌𝐚𝐩𝐩𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤

హోం పేజిలో ఉన్న మెనూ బార్ లో Application అనే కేటగిరిలో Know Your Details అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


తరువాత మీ ఆధార్ నెంబర్ ని నమోదు చేసి GET DETAILS పై క్లిక్ చేస్తే your Aadhaar will be Authenticated అని Pop Up Message వస్తుంది. అప్పుడు మీరు OK బటన్ పై క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది.


వచ్చిన ఓటిపిని ఎంటర్ చేసి VERIFY OTP పై క్లిక్ చేస్తే మీ యొక్క హౌస్ హోల్డ్ వివరాలు అనేవి స్క్రీన్ పైన కనిపిస్తాయి.

To Top