e-Crop Booking in Andhra Pradesh

Telugu Schemes
e-Crop Booking

ఈ-క్రాప్ నమోదు ఆధారంగానే పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ మరియు పెట్టుబడి రాయితీల వంటి కార్యక్రమాల కొరకు ప్రభుత్వం ఈ సమాచారాన్ని ఉపయోగించడం జరుగుతుంది. రైతు ప్రతి సీజన్ లో తను వేసిన పంటను తమకు దగ్గరలోని రైతు భరోసా కేంద్రంలోని విల్లేజి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ ద్వార ఈ-క్రాప్ బుకింగ్ చేయుంచుకోవాలి.

Scheme Benefits

ఈ-క్రాప్ నమోదు చేయుంచుకోవడం వలన రైతు అనుకోని పరిస్థితులలో వరదలు, తుఫానులు వలన పంట నష్టం జరిగితే ఈ-క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా రైతుకు పంట నష్ట పరిహారం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ, పెట్టుబడి రాయితీ ఇలాంటి కార్యక్రమాల ద్వార రైతు పెట్టుబడి సాయం పొందే అవకాశం ఉంటుంది.

How to Register on e-Crop?

రైతు తను వేసిన పంటను ఈ-క్రాప్ బుకింగ్ చేయుంచుకోవాలంటే తమకు దగ్గరలోని రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదిస్తే అక్కడ ఉన్న విల్లేజి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ గారు రైతు యొక్క పొలానికి వచ్చి రైతు వేసిన పంటను ఫోటోలు తీసి అలాగే రైతు వివరాలను ఈ-క్రాప్ మొబైల్ అప్లికేషను నందు నమోదు చేస్తారు. అలాగే పంటకు సంబందించిన వివరాలను అనేవి జియో-ట్యాగ్ చేస్తారు. ఈ-క్రాప్ నమోదు సమయంలో విల్లేజి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ గారు రైతు యొక్క వివరాలు ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని ఈ-క్రాప్ బుకింగ్ చేయాల్సివుంటుంది.


మీ యొక్క పొలం సర్వే నెంబర్ లేదా ఖాతా నెంబర్ పై ఈ-క్రాప్ బుకింగ్ అయ్యిందా! లేదా అని సందేహముగా ఉన్నదా? అయితే ఈ-క్రాప్ బుకింగ్ స్టేటస్ అనేది ఈ క్రింద తెలిపిన విధముగా తెలుసుకోండి.

Required Documents
  • ఆధార్ కార్డు
  • బ్యాంకు అకౌంట్
  • పొలం పాస్ బుక్
  • 1బి
  • ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్
e-Crop Booking Status

✅ ముందుగా మీరు ఈ కర్షక్ అధికారిక karshak.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలి. మెనూ బార్ లో ఉన్న Search ఆప్షన్ Search By Khata And Survey Number అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


✅ మీరు చూడాలనుకుంటున్న పంట సంవత్సరం, జిల్లా, మండలం, గ్రామము మరియు సర్వే నెంబర్ లేదా ఖాతా నెంబర్ ను ఎంచుకోవాలి.


✅ సర్వే నెంబర్ లేదా ఖాతా నెంబర్ ను ఎంటర్ చేసి Submit బటన్ పైన క్లిక్ చేస్తే, ఒకవేళ మీరు ఈ-క్రాప్ బుకింగ్ చేయుంచి ఉంటే మీ వివరాలు అనగా

  1. మండలం పేరు
  2. గ్రామము పేరు
  3. రైతు పేరు
  4. రైతు యొక్క తండ్రి పేరు
  5. యజమాని లేదా సాగుదారు స్థితి
  6. ఈ-క్రాప్ నమోదు చేసిన తేది
  7. ఖాతా నెంబర్
  8. సర్వే నెంబర్
  9. పంట పేరు
  10. పంట వెరైటీ
  11. ఈ-క్రాప్ బుకింగ్ చేసిన విస్తీర్ణం
  12. మొత్తం విస్తీర్ణం
  13. మొబైల్ నెంబర్
  14. రైతు వయస్సు

పైన తెలిపిన వివరాలు అనేవి మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఈ-క్రాప్ బుకింగ్ చేయించకుంటే పైన తెలిపిన వివరాలు ఏవి కూడా మీకు స్క్రీన్ పైన కనిపించవు.


ఈ విధముగా ఈ-క్రాప్ దరఖాస్తుదారులు తమ పొలం యొక్క సర్వే నెంబర్ లేదా ఖాతా నెంబర్ ద్వార పంట వివరాలను డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చును.

𝐞-𝐂𝐫𝐨𝐩 𝐁𝐨𝐨𝐤𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐋𝐢𝐧𝐤

To Top