కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్దిక సాయం అందించాలని ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వార అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6వేల రూపాయల చొప్పున లబ్ది చేకూరుతుంది. అయితే ఈ రూ. 6వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేస్తుంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద లభించే రూ. 6వేల రూపాయలను ఏడాదికి మూడు విడతలుగా రైతు అకౌంట్లో జమ అవుతాయి. అయితే ఈ మూడు విడతలు అనేవి ఏడాదిలో నాలుగు నెలలకు ఒకసారి రూ. 2వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయి.
ఇలా డబ్బులు అనేవి అర్హులైన రైతులకు ఒక్కో విడతకు రూ. 2వేల రూపాయలను చొప్పున ఏడాదికి మూడు విడతలు కలిపి రూ. 6వేల రూపాయలను రైతులు లబ్ది పొందుతారు.
- లబ్దిదారులు తప్పనిసరిగా భారతీయులు అయ్యి ఉండాలి.
- చిన్న మరియు సన్నకారు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.
- కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- లబ్దిదారుడు ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉండకూడదు.
- ఆధార్ కార్డు
- బ్యాంకు అకౌంట్
- పొలం పాస్ బుక్
- రేషన్ కార్డు నెంబర్
- మొబైల్ నెంబర్
పియం కిసాన్ పథకంలో దరఖాస్తు చేసుకోవాలంటే మీకు దగ్గరలోని CSC (Common Service Center) వద్ద నమోదు చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక పోర్టల్ లో మీరే దరఖాస్తు చేసుకోవచ్చు.
రైతు దరఖాస్తు చేసుకున్న అప్లికేషను స్టేటస్ ఎలా చూడాలి?
PM Kisan Status: ఒకసారి ఈ పియం కిసాన్ పథకం కొరకు దరఖాస్తు చేసుకున్న తర్వాత రైతు తన యొక్క అప్లికేషను స్టేటస్ ను పియం కిసాన్ పోర్టల్ తనిఖి చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా మీరు పియం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఫార్మర్స్ కార్నర్ లో ఉన్న Status of Self Registered/CSC Farmers అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు చేసుకున్న రైతు యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి, కాప్త్చ కోడ్ ని ఎంటర్ చేసి Search బటన్ పై క్లిక్ చేస్తే అప్లికేషను స్టేటస్ అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది.
💥 𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐖𝐞𝐛𝐬𝐢𝐭𝐞
💥 𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 𝐅𝐚𝐫𝐦𝐞𝐫 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐋𝐢𝐧𝐤