కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఆ పథకాలలో ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ఒకటి. ఈ పథకం ద్వార రైతులకు ఆర్దిక సాయం కింద తక్కువ వడ్డీకే రూ.౩ లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది.
అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలంటే ముఖ్యంగా పి యమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ది పొందుతూ ఉండాలి. కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులు వారు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఏ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ బ్యాంకు లో రూ. 3 లక్షల వరకు రుణం పొందవచ్చును.
కిసాన్ క్రెడిట్ కార్డు ద్వార రుణం తీసుకున్న రైతులకు 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. దీని వలన రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది.
- అప్లికేషను ఫారం
- ఆధార్ కార్డు
- బ్యాంకు అకౌంట్
- పొలం పాస్ బుక్
కిసాన్ క్రెడిట్ కార్డు కోసం మీకు దగ్గరలో ఉన్న CSC (Common Service Center) కామన్ సర్వీస్ సెంటర్ వద్ద నమోదు చేసుకోవచ్చు లేదా దగ్గరలో ఉన్న బ్యాంకు లో అయిన దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ ముందుగా మీరు కిసాన్ క్రెడిట్ కార్డు సి యస్ సి లాగిన్ దరఖాస్తు చేసే వెబ్ సైట్ https://eseva.csccloud.in/KCC/Default.aspx ను సందర్శించాలి.
✅ హోం పేజిలోని DIGITAL SEVA CONNECT పై క్లిక్ చేయాలి. APPLY NEW KCC పై క్లిక్ చేసి పి యమ కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో లబ్ది పొందే రైతు యొక్క ఆధార్ నెంబర్ చేసి SUBMIT బటన్ పై క్లిక్ చేయాలి.
✅ రిజిస్ట్రేషన్ పేజి ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ పేజి లో అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించాలి, మీరు ఒకసారి ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా చదివి పూరించాలి.
✅ డిక్లరేషన్ బాక్స్ పై టిక్ చేసి SUBMIT బటన్ పై క్లిక్ చేస్తే సి యస్ సి వాల్లేట్ నుండి రిజిస్ట్రేషన్ పేమెంట్ కట్టమని ఒక పేజి ఓపెన్ అవుతుంది. అందులో సి యస్ సి VLE యొక్క పాస్వర్డ్ మరియు వాల్లేట్ పిన్ ఎంటర్ చేసి SUBMIT బటన్ పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది.