Aadhaar Card and Mobile Number Link Status

Telugu Schemes

ప్రస్తుతం ఉన్న రోజులలో ప్రభుత్వం నుండి వచ్చే ఎలాంటి పథకాలు అయిన ప్రజలు లబ్ది పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే పథకాల రిజిస్ట్రేషన్ సమయంలో OTP దృవీకరణ కోసం ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి.


అయితే మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో ఈ కింద తెలిపిన విధముగా తెలుసుకోండి.

Aadhaar Card & Mobile Number Link Status

✅ ముందుగా మీరు ఆధార్ యొక్క అధికార వెబ్ సైట్ ను సందర్శించాలి.


✅ తరువాత వెబ్ సైట్ ను స్క్రోల్ డౌన్ చేస్తే మీకు Aadhaar Services కేటగిరీ కనిపిస్తుంది. అప్పుడు మీరు Aadhaar Services కేటగిరిలో ఉన్న Verify an Aadhaar అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.


✅ మరొక వెబ్ పేజి కి పేజి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ Enter Aadhaar Number దగ్గర మీ ఆధార్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేసి మరియు Enter Captcha దగ్గర అక్కడ ఉన్న కాప్త్చ కోడ్ ని ఎంటర్ చేసి Proceed And Verify Aadhaar పైన క్లిక్ చేయండి.


✅ స్క్రీన్ పైన మీ యొక్క వివరాలు అనగా మీ వయస్సు, లింగం, రాష్ట్రం పేరు మరియు మీ ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబర్ లాంటి వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.


✅ మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయితే అక్కడ మీ మొబైల్ నెంబర్ చివరి మూడు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే Mobile ఆప్షన్ దగ్గర Null అని చూపిస్తుంది.

UIDAI Official Website

To Top