Know your Electricity Meter Service Number in AP: ప్రతి ఇంటిలోనూ, షాప్ లలో అలాగే విద్యుత్ అవసరమయ్యే ప్రతి చోట విద్యుత్ మీటర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే వారు ఉపయోగిస్తున్న విద్యుత్ మీటర్ యొక్క సర్వీస్ నెంబర్ అనేది చాలా మందికి తెలియదు. అంతే కాకుండా వారి యొక్క ఆధార్ నెంబర్ కి ఎన్ని విద్యుత్ మీటర్ లు లింక్ అయ్యి ఉన్నాయి అనే విషయం కూడా తెలియదు.
ముందుగా మీరు ఈ కింద తెలిపిన లింక్ లలో మీరు ఉపయోగిస్తున్న Power Distribution Company పై క్లిక్ చేయండి.
పైన ఇచ్చిన లింక్ లో మీరు ఉపయోగిస్తున్న Power Distribution Company పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి మరియు అక్కడ ఇచ్చిన కాప్త్చ కోడ్ ని ఎంటర్ చేసి Submit లేదా View బటన్ పైన క్లిక్ చేయండి
మీ ఆధార్ కార్డుకి ఎన్ని విద్యుత్ మీటర్ లు లింక్ అయ్యి ఉన్నాయో అక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. అలాగే లింక్ అయిన విద్యుత్ మీటర్ సర్వీస్ నెంబర్ కూడా స్క్రీన్ పైన కనిపిస్తుంది.