మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒక కార్డు జారీ చేయబడుతుంది. దానినే జాబ్ కార్డు అని అంటారు. అయితే ఈ జాబ్ కార్డు పొందటానికి 18 సంవత్సరాల వయస్సు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం 100 రోజుల పని కలిపించడం జరుగుతుంది.
✅ మొదటగా మీరు ఉపాధి హామీ పథకం యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
✅ స్క్రోల్ డౌన్ చేసి Quick Access అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 𝐒𝐭𝐚𝐭𝐞 𝐑𝐞𝐩𝐨𝐫𝐭𝐬 పై క్లిక్ చేయండి.
✅ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పేర్లు అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఆపై మీ రాష్త్రం పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆర్దిక సంవత్సరం, మీ జిల్లా, మీ మండలం లేదా బ్లాక్ మరియు మీ పంచాయతిని ఎంచుకోండి.
✅ 𝐑𝟏. 𝐉𝐨𝐛 𝐂𝐚𝐫𝐝 𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐫𝐚𝐭𝐢𝐨𝐧 కేటగిరీలో ఉన్న 𝐉𝐨𝐛 𝐂𝐚𝐫𝐝 𝐑𝐞𝐥𝐚𝐭𝐞𝐝 𝐑𝐞𝐩𝐨𝐫𝐭𝐬 లో 𝐉𝐨𝐛 𝐜𝐚𝐫𝐝/𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐦𝐞𝐧𝐭 𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐞𝐫 అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
✅ మీ జాబ్ కార్డు నెంబర్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు జాబ్ కార్డు వివరాలు మరియు పేమెంట్ స్టేటస్ వివరాలు అన్ని కూడ మీకు అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తాయి.