e-Shram Card | e-Shram Portal

Telugu Schemes

e-Shram Card

భారత దేశంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు కోసం భారత ప్రభుత్వం ఈ-శ్రమ్ పథకాన్ని ప్రారంభించింది. భారత దేశం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ-శ్రమ్ పోర్టల్ ని 2021 ఆగస్టు 26 వ తేదీన ప్రారంభించింది.

Scheme Launching Date - 26 August 2021

Scheme Launched By - The Ministry of Labour & Employment

ఈ పోర్టల్ నమోదు చేసుకున్న కార్మికుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను జారి చేయడం జరుగుతుంది. దానినే UAN నెంబర్ అని అంటారు. ఈ UAN నెంబర్ అనేది 12 అంకెల గల సంఖ్యను కలిగి ఉంటుంది. ఈ-శ్రమ్ పోర్టల్ రిజిస్టర్ చేసుకోవడం వలన ఎన్నో రకాలైన ప్రయోజనాలను పొందవచ్చు.

Benefits

ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదైన ప్రతి కార్మికుడికి రూ.2 లక్షల ప్రమాద భీమా కవరేజి లభిస్తుంది. అలాగే సామాజిక భద్రతా సంక్షేమ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం కలిపిస్తుంది. ఏదైన ప్రమాదం జరిగి లబ్దిదారుడు మరణిస్తే అతనికి వచ్చే ఆర్ధిక ప్రయోజనాలు అన్నీ కూడా తన భార్యకు బదిలీ చేయబడుతాయి. కేంద్ర ప్రభుత్వం కార్మికుడి కోసం అందించే పథకాలు అన్నీ కూడా పొందవచ్చును.

Eligibility Criteria

  • ఖచ్చితంగా అసంఘటిత రంగ కార్మికుడు అయ్యి ఉండాలి.
  • భారతీయుడు అయ్యి ఉండాలి.
  • వయస్సు 16-59 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • PF ఖాతా కలిగి ఉండకూడదు.

Who Eligible?

  • వలస కార్మికులు 
  • చర్మ కార్మికులు 
  • వ్యవసాయ కూలీలు
  • గృహ కార్మికులు
  • కూరగాయల విక్రయదారులు
  • పండ్ల విక్రయదారులు 
  • రిక్షా లాగేవారు
  • బీడీ కార్మికులు 
  • తోలు కార్మికులు 
  • ఆశా వర్కర్లు 
  • ఉప్పు కార్మికులు 
  • బిల్డింగ్ మరియు కన్స్ట్రక్షన్ కార్మికులు
  • మత్స్యకార కార్మికులు 
  • పశుపోషణ కార్మికులు 
  • షేర్ క్రాపర్స్ ఇటుక కార్మికులు 
  • కార్పెంటర్స్ సెరికల్చర్ కార్మికులు 
  • లేబులింగ్ మరియు ప్యాకింగ్ కార్మికులు 
  • బార్బర్స్ కార్మికులు 
  • ఆటో డ్రైవర్లు 

Required Documents

  1. ఆధార్ కార్డు 
  2. ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్
  3. బ్యాంకు అకౌంట్ వివరాలు

Registration Process for e-Shram Card

✅ ముందుగా మీరు ఈ-శ్రమ్ యొక్క అధికార వెబ్ సైట్ ను register.eshram.gov.in/ ను క్లిక్ చేయాలి. ఆ తరువాత Self Registration పేజి ఓపెన్ అవుతుంది.


✅ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ని అక్కడ ఎంటర్ చేసి అలాగే కాప్త్చా కోడ్ ఎంటర్ చేయాలి.


✅ తరువాత EPFO మరియు ESIC కోసం Yes లేదా No ని ఎంపిక చేసుకోవాలి.


✅ ఆ తరువాత Send OTP క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. దానిని మీరు OTP భాగంలో ఎంటర్ చేయాలి.


✅ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ని అక్కడ ఎంటర్ చేసి నిబంధనలు మరియు షరతులను అంగీకరించి Submit పై క్లిక్ చేయాలి. అప్లికేషను ఫారం అనేది ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషను ఫారం లో అడిగిన వివరాలను మొత్తం పూర్తి చేయాలి.


✅ మీరు అప్లికేషను ఫారం మొత్తం పూర్తి చేసిన తర్వాత చివరగా Submit బటన్ పై క్లిక్ చేయాలి. ఈ-శ్రమ్ కార్డు అనేది మీ స్క్రీన్ పైన కనపడుతుంది దానిని మీరు భవిష్యత్ అవసరాల కొరకు ప్రింట్ తీసుకోండి.

e-Shram Official Website

e-Shram Card Download Link

To Top