దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం వాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టింది. అయితే వాక్సిన్ వేయించుకున్న వారికి వెంటనే ఆన్లైన్ లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక సర్టిఫికేట్ ని జారీ చేస్తుంది. ఆ సర్టిఫికేట్ నే కోవిడ్-19 వాక్సిన్ సర్టిఫికేట్ అని అంటారు. విదేశాలకు వెళ్ళాలన్నా, ప్రముఖ పుణ్య క్షేత్రాలకు వెళ్ళాలన్నా ప్రస్తుతం ఈ కోవిడ్ వాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
కోవిడ్-19 వాక్సిన్ సర్టిఫికేట్ లో లబ్దిదారుని వివరాలు అనగా లభ్దిదారుని పేరు, వయస్సు, లింగం, రిఫరెన్స్ ఐడి, టీకా స్థితి మరియు వాక్సినేషన్ వివరాలు అనగా టీకా పేరు, టీకా రకం, తయారీదారు, మోతాదు సంఖ్య, మోతాదు తేది, బ్యాచ్ నెంబర్, టీకాలు వేయిన్చినవారి పేరు అలాగే టీకాలు వేసిన ప్రదేశం పేరు లాంటివి ఉంటాయి.
ఈ వాక్సిన్ సర్టిఫికేట్ ని మీరు ఎన్నో రకాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ లేదా వాట్స్ అప్ నుండి మరింత సులభంగా ఈ కోవిడ్-19 వాక్సిన్ సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
✅ ముందుగా మీరు కోవిన్ పోర్టల్ https://www.cowin.gov.in/ ఓపెన్ చేసి అక్కడ ఉన్న REGISTER/SIGN IN బటన్ పైన క్లిక్ చేయాలి.
✅మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి GET OTP పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది దానిని మీరు ఎంటర్ చేసి Verify & Proceed బటన్ పైన క్లిక్ చేయండి.
✅ అక్కడ మీ పేరు ఉన్న టాబ్ లో సర్టిఫికేట్ పైన క్లిక్ చేస్తే స్క్రీన్ పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. అప్పుడు మీరు డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేయండి మీ యొక్క కోవిడ్-19 వాక్సిన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది.